రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ రావు జన్మదిన సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో... జడ్పీ ఛైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, సీఈఓ నరేందర్ మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ... ఆయన వందేళ్లు ఆరోగ్యంగా జీవించాలని దేవడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
రాజ్యసభ సభ్యుడు గ్రీన్ ఛాలెంజ్ సవాల్‌ను స్వీకరిస్తూ తమ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటినట్లు జడ్పీ ఛైర్ పర్సన్ తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షిస్తామన్నారు. చెట్లు నాటడం వల్ల సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయని నల్లాల భాగ్యలక్ష్మి అన్నారు. ప్రతి ఒక్కరూ గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటాలని సూచించారు.
ఇవీ చూడండి: అత్యాచార నిందితుడిపై న్యాయవాదుల దాడి