ETV Bharat / state

కొవిడ్​తో ఉపాధ్యాయ దంపతులు మృతి - తెలంగాణలో కొవిడ్​ వార్తలు

కొవిడ్​ మహమ్మారి ఆ ఇంట తీరని విషాదాన్ని నింపింది. ఇద్దరి బిడ్డలతో సంతోషంగా సాగుతున్న వారి బతుకులను అర్ధాంతరంగా ముగించేసింది. నలుగురుండే కుటుంబంలో మూడు నెలల వ్యవధిలో ఒక్క కుమార్తె మిగిలింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా గడ్డెరగడిలో జరిగింది.

couple died
Telangana news
author img

By

Published : May 13, 2021, 11:03 PM IST

మంచిర్యాల జిల్లా గడ్డెరగడిలో ఉపాధ్యాయ దంపతులు కొవిడ్​తో మృతి చెందారు. ఆసిఫాబాద్ జిల్లా బాలుర ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న నాగినేని బాల శైలజ(43), వేములపల్లి కేతన పల్లి పాఠశాలలో పి.సీతారామరాజు (45) ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. సీతారామరాజు గతనెల 29న కొవిడ్​ లక్షణాలతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్​ వచ్చింది. అప్పటి నుంచి ఆన్​లైన్​లో వైద్యుల సలహాలు తీసుకుంటూ హోం ఐసోలేషన్​లో చికిత్స తీసుకున్నాడు. ఈనెల 3న శైలజకు లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా నెగిటివ్​ వచ్చింది.

లక్షణాలు ఉండడం వల్ల హోం ఐసోలేషన్​లో ఉంటూనే చికిత్స తీసుకున్నారు. అయితే ఇద్దరి ఆరోగ్య పరిస్థితి క్షీణించడం వల్ల ఈ నెల 6న బెల్లంపల్లిలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో శైలజకు పాజిటివ్​ వచ్చింది. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్​కు తరలించగా... అక్కడ చికిత్స పొందుతూ 11న రాత్రి శైలజ మృతి చెందింది. ఈ విషయం ఆమె భర్తకు చెప్పలేదు. ఇవాళ భర్త కూడా మృతి చెందాడు. ఇంటర్​ చదువుతున్న వీరి కుమార్తె యశస్విని మూడు నెలల క్రితం అనారోగ్య సమస్యలతో మృతి చెందింది. కుటుంబంలోని ముగ్గురు మృతిలో ఒంటరిగా మిగిలిన ఒక్కగానొక్క కూతురు రోదన చూపరులను కన్నీరు పెట్టించింది.

ఇదీ చూడండి: 'ఇంట్లోనే ప్రార్థనలు జరుపుకోవాలి... మసీదులో నలుగురికే అనుమతి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.