ETV Bharat / state

ఆన్​లైన్​ తరగతులపై ఉపాధ్యాయురాలి వినూత్న ప్రచారం - మంచిర్యాల జిల్లా వార్తలు

కరోనా నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్​లైన్​ తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఆన్​లైన్​ పాఠాలు వినేలా చూడాలని ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మంచిర్యాల జిల్లా భీమినిలో ఓ ఉపాధ్యాయురాలు ఆన్​లైన్​ పాఠాలపై వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు.

teacher campaign on online clasess in manchiryala district
మైక్​తో ఆన్​లైన్​ తరగతులపై ఉపాధ్యాయురాలి వినూత్న ప్రచారం
author img

By

Published : Sep 13, 2020, 1:21 PM IST

మంచిర్యాల జిల్లా భీమిని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో సువర్ణ స్కూల్ అసిస్టెంట్​గా పని చేస్తున్నారు. ఆన్​లైన్​ తరగతులపై వినూత్న రీతిలో ప్రచారం చేపట్టారు. ఆటోలో తిరుగుతూ మైక్​లో ఆన్​లైన్​ తరగతులపై ప్రచారం చేస్తున్నారు.

తల్లిదండ్రులను పరిమిత సంఖ్యలో సమావేశపరిచి నిబంధనలు పాటిస్తూ టీ శాట్, దూరదర్శన్​​లో పాఠాలు వినేలా చూడాలని ఆమె కోరారు. ఈ ప్రచారంతో విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో అవగాహన పెరిగింది. పాఠశాలలోి మొత్తం 239 మంది విద్యార్థులు ఉండగా.. 200 మందికి పైగా విద్యార్థులు పాఠాలు వింటున్నారు.

ఇదీ చదవండి: రెవెన్యూ శాఖలో కొత్త పోస్టులు... కసరత్తు ప్రారంభించిన అధికారులు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.