ETV Bharat / state

సెలవుల్లో సాంకేతికతను ఓ పట్టు పట్టేద్దాం...

వేసవి సెలవులు వచ్చేశాయి. ఎంచక్కా ఆడుకోవచ్చు... ఇది అప్పటి విద్యార్థుల మాట. సెలవుల్లో కొత్త కొత్త  సాంకేతిక అంశాలు నేర్చుకుందాం... ఇదీ నేటి విద్యార్థుల బాట. భవిష్యత్​కు ఉపయోగపడేలా సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి సమ్మర్​ సమురాయ్​ కార్యక్రమంలో శిక్షణ తీసుకుంటున్నారు. మొబైల్​ యాప్​, డ్రోన్​ తయారీ, వీడియో గేమ్​లు తయారీలో ప్రతిభ కనబరుస్తున్నారు గురుకుల విద్యార్థులు. మంచిర్యాల జిల్లాలో నిర్వహిస్తున్న సమ్మర్​ సమురాయ్​పై ప్రత్యేక కథనం..

సాంకేతిక శిక్షణ
author img

By

Published : Apr 15, 2019, 5:05 PM IST

ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది. సాంకేతిక జ్ఞానం లేకపోతే ముఖ్యమైన పనులు జరగడం లేదు. వ్యవసాయం దగ్గర నుంచి పెద్ద పెద్ద పరిశ్రమల వరకూ ఉత్పాదకతలో లాభాలు ఆర్జించడానికి నూతన టెక్నాలజీని వాడుతున్నారు. భవిష్యత్​ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు సాంకేతిక శిక్షణనివ్వాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఈ ఏడాది సమ్మర్​ సమురాయ్​ కార్యక్రమం చేపడుతున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలురు, బాలికల పాఠశాలల్లో రెండు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆరు నుంచి పదోతరగతి చదివే పిల్లలకు డ్రోన్​ తయారీ, మొబైల్​ యాప్​ వంటి అంశాలపై తర్ఫీదునిస్తున్నారు సమురాయ్​ నిర్వాహకులు. ఈనెల 10న ప్రారంభమైన కార్యక్రమం 25 వరకు కొనసాగనుంది.

విద్యార్థుల్లో ఉత్సాహం

రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్​, కరీంనగర్​, ఆదిలాబాద్​ జిల్లాల నుంచి మొత్తం 800 మంది విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. మొబైల్​ యాప్​ ఎలా తయారు చేయాలి..?, ఆధునీకరణ అంశాలపై 18 మంది శిక్షకులు బాల బాలికలకు వేరు వేరుగా తర్ఫీదు ఇస్తున్నారు. డ్రోన్​ తయారీ గురించి కూడా పిల్లలకు వివరిస్తున్నారు. రానున్న రోజుల్లో డ్రోన్​లు కీలక పాత్ర పోషిస్తాయని శిక్షణ నిర్వాహకులు తెలిపారు. పిల్లలకు సెలవుల్లో ఇలాంటి అంశాలపై శిక్షణ ఇవ్వడం వల్ల వారు కొత్త కొత్త సాంకేతికత అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని శిక్షణ ఇంఛార్జి శ్రావణ్​ అన్నారు.

వీడియో గేమ్స్​ తయారీపై శిక్షణ

విద్యార్థులకు వీడియో గేమ్స్​ తయారీపై కూడా శిక్షణ అందిస్తున్నారు. ప్రతి విద్యార్థికి ల్యాప్​టాప్​ ఇచ్చి వారు కొత్త ఆటలను తయారు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. తమకు సాంకేతిక అంశాలు నేర్చుకోవడం చాలా ఆనందంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. గురుకులాల సంస్థ కార్యదర్శి ఆర్​.ఎస్​.ప్రవీణ్​కుమార్​కు కృతజ్ఞతలు తెలిపారు.
తమ పిల్లలు సెలవుల్లో కొత్త కొత్త సాంకేతిక విషయాలు నేర్చుకోవడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు వల్ల పిల్లల్లో మరింత సృజనాత్మకత పెంపొందుతుందని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల్లో సాంకేతికత పెంపొందడానికి కృషి చేస్తున్న శిక్షణ నిర్వాహకుల్ని అభినందిస్తున్నారు.

సాంకేతిక శిక్షణనిస్తున్న నిర్వాహకులు

ఇదీ చదవండి : భూ వివాదంలో నడిరోడ్డుపై హత్యాయత్నం

Intro:TG_MBNR_3_15_RAITHULA_MAHA_DHARNA_PKG_C8
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:9885989452
( ) కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నీటిని కాలువల ద్వారా తమ ప్రాంతానికి పారించాలని రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. సాగునీరు చెరువులు కుంటలు నింపాలని చేగుంట gorita వెల్కిచర్ల గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పంటలు సాగు చేయడానికి కాక కనీసం తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి సుమారు ఐదు గంటలకు పైగా ఆందోళన చేపట్టారు.

1VOICEOVER :- నాగర్కర్నూల్ నియోజకవర్గం తిమ్మాజీపేట మండలం లోని వెల్కిచర్ల చేగుంట గోరిట గ్రామంలోని సుమారు పదిహేను కుంటలు చెరువులు నింపితే వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎన్నో ఏళ్లుగా అధికారులకు నాయకులకు గోడు చెప్పిన ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఈరోజు ఉదయం 8 గంటల నుంచి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రోడ్డు పై కూర్చొని వంటావార్పు చేశారు. రైతులు ఉదయం 8 గంటల నుంచి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కలెక్టరు రావాలని నినాదాలు చేశారు. ఉదయం ఎనిమిది గంటలకు అక్కడే టిఫిన్లు వండి రోడ్డుపైనే ఆరగించారు. మా గోడు మొరపెట్టుకున్నా అధికారులు నాయకులు వినిపించుకోవడం లేదని చుట్టుముట్టు ఉన్న అన్ని గ్రామాలకు నీరు అందించారు. కానీ మా మూడు గ్రామాలకు నీరు పారించడం లేదని వాపోయారు. గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగనూరు గ్రామంలో కాలువల ద్వారా నీరు అందిస్తున్నారని అక్కడినుంచి మా గ్రామానికి అందించాలంటే కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు కే ఎల్ ఐ కాల్వ పరిధిలో ఉన్న అన్ని గ్రామాలకు నీరు అందించారు. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు కూడా నీరందించారు .కానీ వెల్కిచర్ల gorita చేగుంట గ్రామాలకు చుక్క నీరు ఫారిన్చలేదని ఆందోళన చెందారు. ఈ మూడు గ్రామాలకు వేల ఎకరాలు ఆయకట్టు ఉందని మూడేళ్లుగా వర్షాలు సరిగా పడక చెరువులు కుంటలు నిండాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని కె.ఎల్ ఐ కాలువ ద్వారా నీరు వస్తే పంటలు పండించుకోవచ్చు అనుకుంటే తమ ఆశలు అడియాసలయ్యాయి అంటున్నారు.....bytes
bytes:- చేగుంట గ్రామ రైతులు(1,2,3)

2VOICEOVER:-. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో చేసేదేమీ లేక పోలీసులు ఆర్టీసీ బస్సులను ద్విచక్ర వాహనాలను వేరే దారి నుంచి మళ్లించడంతో పోలీసులకు రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.రైతులు నేరుగా రోడ్డుపైనే టెంట్ వేసి కూర్చున్నారు. అధికారులు ఎవరూ రాకపోవడంతో మధ్యాహ్నం భోజనం కోసం వంట వార్పు ఏర్పాటు చేశారు. చుట్టుముట్టు ప్రాంతాల వారు రెండు పంటలు పండించుకునే ఇక్కడ ఒక పంట కూడా పండించుకో లేక పోతున్నామని ఎండాకాలం లో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని సాగునీరే కాక తాగు నీరు లేని పరిస్థితి ఏర్పడిందని బోర్లు రావడంలేదని బావులు ఇంకి పోయాయని తమ పశువులను వేరే ప్రాంతాలకు తరలించాల్సి వస్తుందని పశువులకు మేత కనీసం నీటిని కూడా తప్పలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. పంటలు పండించు కోలేక కూలీలకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మా పొలాలు పెట్టుకొని పక్క గ్రామాలకు వెళ్లి కూలి పని చేయాల్సిన పరిస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. నాయకులు అధికారులు తమ గ్రామాలకు పట్టించుకోవడంలేదని ఇలాగే ఉంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని తెలిపారు.....bytes
bytes:- ఆందోళన చేస్తున్న రైతులు(5,6,7,8)
3VOICEOVER:-ఎట్టకేలకు జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎ ఎస్ పి జోకుల చెన్నయ్య రైతుల ఆందోళన వద్దకు వచ్చి వారి సమస్యలను విన్నారు. రైతులను శాంతింపజేసి వారి సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.....byte
byte:-(4) జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి.
EVO:- దీంతో రైతులు ఆందోళన విరమింపజేశారు. సుమారు ఐదు గంటలకు పైగా సాగిన ఈ ఆందోళనతో ఎక్కడికక్కడ బస్సు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

Body:TG_MBNR_3_15_RAITHULA_MAHA_DHARNA_PKG_C8

Conclusion:TG_MBNR_3_15_RAITHULA_MAHA_DHARNA_PKG_C8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.