లాక్‌డౌన్ కారణంగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పరిసర ప్రాంతాల్లో ఉపాధి లేక ఆకలితో అలమటిస్తోన్న 50 మంది ఆటో డ్రైవర్లను ఆర్‌కే-06 సింగరేణి గని యువ కార్మికులు ఆదుకున్నారు. సింగరేణి కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి చేతుల మీదుగా నిత్యావసరాలు పంపిణీ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఆకలితో అలమటిస్తోన్న పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో సింగరేణి యువ కార్మికులు చేస్తున్న సేవా కార్యక్రమాన్ని ఆయన ప్రశంసించారు.
ఇదీ చూడండి: కుష్టు వ్యాధి వ్యాక్సిన్‌తో కరోనా చికిత్స!