ETV Bharat / state

మరో శిఖరానికి చేరుకున్న సింగరేణి - మంచిర్యాల జిల్లా తాజా వార్తలు

సింగరేణి సిగలో మరో ఘనత నమోదైంది. 220 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న సోలార్​ పవర్​ ప్లాంటులో 5 మెగావాట్ల సామర్థ్యం ఉన్న తొలి ప్లాంటును అందుబాటులోకి తెచ్చింది.

మరో శిఖరానికి చేరుకున్న సింగరేణి
మరో శిఖరానికి చేరుకున్న సింగరేణి
author img

By

Published : Jan 11, 2020, 6:44 AM IST

మరో శిఖరానికి చేరుకున్న సింగరేణి

సింగరేణి... మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. 220 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న సోలార్‌ పవర్‌ ప్లాంటులో 5 మెగావాట్ల సామర్థ్యం ఉన్న తొలి ప్లాంటు అందుబాటులోకి వచ్చింది. 33 కేవీ పవర్‌ లైనుకు అనుసంధానం చేసి సోలార్‌ విద్యుత్‌ ఉత్పాదన రంగంలో అడుగుపెట్టింది. దేశంలోనే థర్మల్‌, సోలార్‌ విద్యుదుత్పాదన చేస్తున్న తొలి బొగ్గు కంపెనీగా.. సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.

మంచిర్యాల జిల్లా సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో నిర్మాణం పూర్తైన తొలిదశ 5 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంటును.. శుక్రవారం గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. సౌరవిద్యుత్‌ రంగంలోకి అడుగుపెట్టడంపై సింగరేణి సీఎండీ శ్రీధర్‌ హర్షం వ్యక్తంచేశారు. ఇందుకోసం కృషి చేసిన అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.

ఇవీ చూడండి: 21 వేల 850 నామినేషన్లు.. నేడు పరిశీలన

TG_HYD_13_11_SINGARENI_SOLAR_AV_3182400 note: ఫీడ్ తాజా వాట్సప్ కి పంపాము ( )సింగరేణి సంస్థ తన చరిత్రలో మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 220 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్‌ పవర్‌ ప్లాంటులో5 మెగావాట్ల సామర్ధ్యం గల తొలి ప్లాంటు విద్యుత్‌ ను 33 కె.వి. పవర్‌ లైనుకు అనుసంధానం చేసి సోలార్‌ విద్యుత్‌ ఉత్పాదన రంగంలోకి అడుగుపెట్టింది. దీనితో దేశంలోనే థర్మల్‌ మరియు సోలార్‌ విద్యుత్‌ ఉత్పాదన రంగంలోకి అడుగుపెట్టిన తొలి బొగ్గు కంపెనీగా సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. మంచిర్యాల జిల్లా సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో నిర్మాణం పూర్తయిన తొలిదశ 5 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంటు విద్యుత్‌ ఉత్పాదన ప్రారంభించగా శుక్రవారం మధ్యాహ్నాం 2 గంటల 27 నిమిషాలకు గ్రిడ్‌ కు అనుసంధానం ప్రక్రియ పూర్తి చేశారు. దీనిపై సంస్థ సి.ఎం.డి. శ్రీ ఎన్‌.శ్రీధర్‌ తన హర్షం ప్రకటిస్తూ ఇందుకు కృషి చేసిన అధికారులు, సిబ్బందికి తన అభినందనలు తెలిపారు. దేశంలో మరేఇతర ప్రభుత్వ బొగ్గు ఉత్పత్తి సంస్థ కూడా ఇలా థర్మల్‌, సోలార్‌ విద్యుత్‌ ఉత్పాదన రంగాలోనికి అడుగుపెట్టలేదని పేర్కొంటూ, సింగరేణికే ఈ అరుదైన గౌరవం దక్కుతుందని పేర్కొన్నారు. తెలంగాణా ప్రగతికి బొగ్గు, థర్మల్‌, సోలార్‌ విద్యుత్తు ద్వారా సహకరిస్తున్నందుకు ప్రతీ సింగరేణీయుడు ఎంతో సంతోషిస్తున్నాడని ఆయన పేర్కొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.