ETV Bharat / state

DRINKING CONTAMINATED WATER: కలుషిత నీరు తాగి 43మంది విద్యార్థులకు అస్వస్థత - ఆదిలాబాద్ తాజా వార్తలు

DRINKING CONTAMINATED WATER: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న వార్తలు తరుచూ వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బాసర ఆర్జీయూకేటీలో భోజనంలో కప్పలు, పురుగులు వచ్చాయనే వార్తలు సోషల్​మీడియాలో చక్కర్లు కొట్టాయి. మూడురోజుల క్రితం కస్తూర్భా గాంధీ పాఠశాలలో అల్పాహారం వికటించి 32 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారనే విషయం మరువకముందే.. తాజాగా శ్రీరాంపూర్ డివిజన్​లో సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్​లో కలుషిత నీరు తాగి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

Students receiving treatment
చికిత్స పొందుతున్న విద్యార్థులు
author img

By

Published : Mar 15, 2022, 10:30 PM IST

DRINKING CONTAMINATED WATER: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్ ఏరియాలోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్​లో కలుషిత నీరు తాగి 43 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు కావడంతో సింగరేణి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఆరుగురు విద్యార్థినిలు ఉండగా.. 37 మంది విద్యార్థులు ఉన్నారు.

హాస్టల్ లోని వాటర్​ ట్యాంక్​లో ఉన్న నీరు తాగడంతోనే అందరూ అనారోగ్యానికి గురయ్యారని ఏరియా హెల్త్ ఆఫీసర్ రమేష్ బాబు తెలిపారు. 37 మందిని డిశ్చార్జ్ చేశామని ఆరుగురు విద్యార్థులను రామకృష్ణాపుర్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి: Missile Attack in Iraq : ఇరాక్‌లో క్షిపణుల దాడి నుంచి తప్పించుకున్న తెలంగాణ కార్మికులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.