ETV Bharat / state

ఆన్‌లైన్‌ తరగతులు.. అవస్థల పాఠాలు.. - మంచిర్యాల జిల్లా వార్తలు

కరోనా మహమ్మారి కారణంగా మంచిర్యాల జిల్లాలో అమలు చేస్తున్న ఆన్‌లైన్‌ బోధన ఆగుతూ.. సాగుతోంది. కేవలం 75శాతం మంది విద్యార్థులు మాత్రమే పాఠాలు వింటున్నారు. పల్లెల్లో విద్యుత్తు సమస్య ఇబ్బందికరంగా మారింది. ఆన్‌లైన్‌ పాఠానికి వర్క్‌షీట్లకు మధ్య పొంతన లేకపోవడంతో విద్యార్థులు తికమక పడుతున్నారు. వాటిని అర్థం చేసుకోలేక అవస్థలు పడుతున్నారు. వర్క్‌షీట్లను పాఠాలకు అనుగుణంగా దిద్దలేక ఉపాధ్యాయులు ఇబ్బందిపడుతున్నారు.

online classes
online classes
author img

By

Published : Sep 27, 2020, 2:00 PM IST

మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ పరిధిలో 736 ప్రభుత్వ విద్యాసంస్థలు ఉన్నాయి. ఆయా బడుల్లో మూడు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధన సాగుతోంది. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి కొనసాగుతున్న ఈ తరగతులకు ప్రస్తుతం 75శాతం మందే హాజరవుతున్నారు. మొక్కుబడిగానే విద్యార్థులు డిజిటల్‌ బోధనలు వింటున్నారు. నిర్ణీత సమయానికి టీవీల ముందు పుస్తకాలు పట్టుకొని పాఠాలు వినేది అంతంత మాత్రమే. అయితే రోజువారి విద్యార్థుల పర్యవేక్షణ ఉపాధ్యాయులకు సవాలుగా మారింది.

అర్థం చేసుకోలేక అవస్థలు..

విద్యార్థులు ఇంటి వద్ద హోం వర్క్‌ చేసుకునేలా రాష్ట్రస్థాయిలో ఉపాధ్యాయులు వర్క్‌షీట్లను రూపొందించారు. జిల్లాకు వచ్చిన వర్క్‌షీట్లను రోజువారి పాఠాల అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులకు వాట్సప్‌ ద్వారా పంపుతారు. విద్యార్థులు వాటిని పూర్తి చేసి ఉపాధ్యాయులకు పంపిస్తారు. అయితే ఆ రోజు చెప్పిన పాఠానికి వర్క్‌షీట్లకు మధ్య తేడాలుంటున్నాయి. విద్యార్థులు అర్థం చేసుకోలేక తికమక పడుతున్నారు. ఉదాహరణకు మొదటి రెండు వారాల్లో రెండు అధ్యాయాలకు సంబంధించి ఐదు పాఠ్యాంశాలు ప్రసారమైతే వీటికి సంబంధించిన వర్క్‌షీట్లలో వంద పేజీల సమాచారం ఉంది. వీటిని చదివి ఉదాహరణలు అర్థం చేసుకోవడం విద్యార్థులకు ఇబ్బందికరంగా మారుతోంది.

అన్నీ అంతరాయాలే..

అయిదు నెలల తర్వాత పాఠాలు మొదలైనా విద్యుత్తు సరఫరా ఆటంకాలు కలిగిస్తోంది. బోధన జరిగే సమయంలో విద్యుత్తు సరిగా ఉండటం లేదు. గ్రామాల్లో ఈ సమస్యలు అధికంగా ఉంటున్నాయి. కొన్ని గ్రామాల్లో తల్లిదండ్రులు పిల్లలకు చరవాణులు ఇవ్వడం లేదు. టీవీలు లేక బోధనలకు దూరంగా ఉంటున్నారు.

మార్పులు చేయాలి..

రెండు రకాల వర్క్‌షీట్లు అందుబాటులో ఉన్నాయి. స్థాయి-1లో ప్రాథమిక సమాచారం ఉంటుంది. స్థాయి-2లో ఉన్న అంశాలు టీవీల్లో రావడంలేదు. వీటిని విద్యార్థులు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. ఎక్కువ పేజీల్లో ఉన్న వర్క్‌షీట్లు సమస్యగా మారాయి. దీనిపై విద్యాశాఖ పునరాలోచించాలి.

- గంగాధర్‌, గణిత ఉపాధ్యాయుడు

ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషించాలి

డిజిటల్‌ బోధనలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. ఆన్‌లైన్‌ తరగతులను మానిటరింగ్‌ బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. 75శాతం మంది విద్యార్థులు ఆన్‌లైన్‌ పాఠాలు వింటున్నారు.అంతర్జాలం లేని సదుపాయాల్లో విద్యార్థులకు వర్క్‌షీట్లను ఇవ్వాలని సూచించాం.

- వెంకటేశ్వర్లు, డీఈవో మంచిర్యాల

  • జిల్లాలోని మొత్తం పాఠశాలలు: 736
  • 3 నుంచి 10వ తరగతి విద్యార్థులు: 37,326
  • ఆన్‌లైన్‌ తరగతులకు హాజరైన విద్యార్థులు: 29,277 (గురువారం), 29,247(శుక్రవారం)

ఇదీ చదవండి : ముగ్ధ మనోహరం: మూసీ మురిపిస్తోంది.. కృష్ణా కనువిందు చేస్తోంది...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.