తెలంగాణ రాష్ట్రం ఎర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకే కృషి చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కత్తెరశాల గ్రామంలోని వైస్ ఎంపీపీ బాపు రెడ్డికి చెందిన పామాయిల్ తోటను ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీష్‌లతో కలిసి ఆయన పరిశీలించారు.
మెరుగైన దిగుబడి సాధించేందుకు పంట మార్పిడి పద్ధతి అనివార్యమని నిరంజన్ రెడ్డి అన్నారు. శాస్త్రవేత్తలు కూడా పంట మార్పిడి పద్ధతినే సూచిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. పామాయిల్ పంటను ఒకసారి సాగు చేస్తే నాలుగేళ్లకు మొదలై 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందని పేర్కొన్నారు. సంప్రదాయ పంటల సాగు నుంచి రైతులు బయటకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: 'వేగాన్ని నియంత్రించినప్పుడే ప్రమాదాలు నివారించగలం'