ETV Bharat / state

వలస కూలీలకు పోలీసుల అన్నదానం

లాక్​డౌన్​ వల్ల అవస్థలు పడుతున్న వలస కూలీలకు మంచిర్యాల పోలీసులు అన్నదానం చేశారు. సీఎం కేసీఆర్​, ఎంపీ సంతోశ్​కుమార్​ ఆదేశాల మేరకు వలస కార్మికులకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు.

పోలీసుల అన్నదానం
పోలీసుల అన్నదానం
author img

By

Published : May 2, 2020, 3:40 PM IST

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాలలో వలస కూలీలకు పోలీసులు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్​ సత్యనారాయణ హాజరై కూలీలకు ఆహారం వడ్డించారు. సీఎం కేసీఆర్​, ఎంపీ జోగినిపల్లి సంతోశ్​కుమార్ ఆదేశాలతో రామగుండం కమిషనరేట్​ పరిధిలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో ఈ కార్యక్రమం చేపట్టినట్లు సీపీ తెలిపారు.

వలస కార్మికులెవరూ ఆకలితో రాష్ట్ర సరిహద్దులు దాటకూడదని ఆయన అన్నారు. అవసరమైతే వారికి ప్యాకింగ్ ఆహారం, చిన్నపిల్లలకు బిస్కెట్లు, స్నాక్స్ లాంటివి అందించనున్నట్లు తెలిపారు. మధ్యప్రదేశ్​, మహారాష్ట్ర, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలకు చెందిన కొందరు కార్మికులు నడుచుకుంటూ వెళ్తున్నారని... కొందరు ఎలాంటి అనుమతులు లేకుండా... మరికొందరు అనుమతులు తీసుకుని వాహనాల్లో వెళ్తున్నారని చెప్పారు.

ఇదీ చూడండి: కాంక్రీట్​ మిక్సర్​ ట్యాంక్​లో 18 మంది కూలీల ప్రయాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.