రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడే బిల్లులు ప్రవేశ పెడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మండిపడ్డారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ ఆర్థిక దోపిడికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
రాష్ట్ర ప్రజలను చైతన్య పరుస్తూ సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర నిర్మాణ మహాసభలను ఈనెల 22 నుంచి 24 వరకు మంచిర్యాల జిల్లాలో నిర్వహిస్తున్నట్లు చాడ వెంకట్రెడ్డి తెలిపారు.
- ఇదీ చూడండి : దిల్లీ తీర్పు: హస్తినను మరోసారి ఊడ్చేసిన ఆప్