మంచిర్యాల జిల్లాలో శుక్రవారం 25 మంది రక్త నమూనాలు సేకరించి ఆదిలాబాద్ రిమ్స్‌కు పంపించగా ఆరుగురికి పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. జన్నారం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో ఇప్పటికే ఒకరికి కరోనా సోకగా తాజాగా మరో ముగ్గురికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇదే మండలం రోటిగుడా గ్రామంలో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు.
జిల్లాలో నమోదైన మెుత్తం 28 పాజిటివ్ కేసులో 27 మంది ముంబయి నుంచి వచ్చిన వారు కాగా మరొకరు స్థానికులు. దీంతో జిల్లా ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముంబయి నుంచి వస్తున్న వారిని నేరుగా బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రానికి తరలిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో సామాజిక వ్యాప్తి జరగలేదని అధికారులు చెబుతున్నారు.