ETV Bharat / state

'చెత్త, కాలుష్యం, కలుషిత నీరే మన శత్రువులు' - latest news on collector bharathi holikeri

పట్టణ ప్రగతిలో భాగంగా బెల్లంపల్లిలోని పలు వార్డుల్లో జిల్లా పాలనాధికారి భారతి హోళికేరి పర్యటించారు. చెత్తను రోడ్లపై వేయకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

collector bharathi holikeri participated in urban progress in bellampalli
'చెత్త, కాలుష్యం, కలుషిత నీరు మన శత్రువులు'
author img

By

Published : Feb 25, 2020, 2:21 PM IST

పట్టణాల్లో చెత్త, కాలుష్యం, కలుషిత నీటిని మన శత్రువులుగా భావించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పలు వార్డుల్లో స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు.

'చెత్త, కాలుష్యం, కలుషిత నీరు మన శత్రువులు'

స్థానిక శిశుమందిర్ పాఠశాల నుంచి అంబేడ్కర్ నగర్ చౌరస్తా వరకు అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. ఓ ఇంటి పక్కన మట్టి కుప్పలు, చెత్త ఉండడం వల్ల ఇంటి యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా రోడ్లపై చెత్తవేస్తే రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు జరిమానా విధించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రగతి కార్యక్రమానికి ప్రజలంతా సహకరించాలని కోరారు.

కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్​పర్సన్ జక్కుల శ్వేత, వైస్ ఛైర్మన్ బత్తుల సుదర్శన్, పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : నూతన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానంతో 'అగ్రిటెక్​'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.