డబ్బు కోసం దేన్నైనా వేటాడతాం
చిరుత పులి చర్మం, గోర్లు రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ప్రత్యేక పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ముఠాలో మిగతా నలుగురు నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. మహారాష్ట్ర సమీపంలోని ముంజవేని ప్రాంతంలో పులుల సంచారం ఎక్కువగా ఉండటం వల్ల ఇటీవల కాలంలో అక్కడ వేట పెరిగింది. అలా చంపిన వాటినే ఇతర ప్రాంతాల్లో విక్రయించడానికి రవాణా చేస్తూ పట్టుబడ్డారు ఈ స్మగ్లర్లు.
నిర్లక్ష్యపు మత్తులో అటవీశాఖ
అటవీ సంరక్షణపై ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉన్నా... అటవీశాఖ సిబ్బంది పనితీరు ఆశాజనకంగా లేదు. ఉన్నతాధికారులు ఇకనైనా.. స్పందించి.. నిఘా తీవ్రతరం చేయాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి :హైదరాబాద్ ఇమేజ్ తగ్గిపోయింది: రేవంత్