మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో గౌరీశంకర్ కాలనీలో నివాసం ఉంటున్న గణేశ్ తన ఆరేళ్ల కుమారుడు కార్తీక్‌తో కలిసి భవనంపై నుంచి గాలి పటం ఎగురవేస్తున్నారు. అయితే, ఇదే సమయంలో గాలిపటం పక్కింటి మేడపై చిక్కుకుంది. ఆ గాలిపటాన్ని తీసి కుమారుడికి అందించాడు.
ఇంటిపైకి చేరుకొన్న తర్వాత దానిని పైకి ఎగురవేసే ప్రయత్నం చేస్తున్న సమయంలో కార్తీక్ భవనం నుంచి కింద పడిపోయాడు. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పండుగ పూట బాలుడు మృతి చెందటం వల్ల ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఇవీచూడండి: చాటింగ్ చేస్తూ భవనంపై నుంచి పడి ఎయిర్‌పోర్టు ఉద్యోగిని మృతి