ETV Bharat / state

Rajapur PHC doctor suspended: వ్యాక్సినేషన్​పై నిర్లక్ష్యం.. పీహెచ్​సీ డాక్టర్​ సస్పెండ్​ - collector suspended rajapur phc doctor

Rajapur PHC doctor suspended: కొవిడ్​ వ్యాక్సినేషన్​లో భాగంగా విధుల్లో లేని పీహెచ్​సీ వైద్యుడిపై సస్పెన్షన్​​ వేటు పడింది. మహబూబ్​నగర్​లోని రాజాపూర్​ పీహెచ్​సీని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్​ వెంకట్రావు.. పీహెచ్​సీ డాక్టర్​ను సస్పెండ్​ చేశారు.

Rajapur PHC doctor suspended:
పీహెచ్​సీ డాక్టర్​ సస్పెండ్​
author img

By

Published : Dec 2, 2021, 4:46 PM IST

Rajapur PHC doctor suspended: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ముప్పు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉండటంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాలకు అప్రమత్తత ప్రకటించింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 15 రోజుల్లో 100 శాతం సాధించే విధంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్ ప్రక్రియను కలెక్టర్ ఎస్​. వెంకట్రావు వేగవంతం చేశారు. అందులో భాగంగా మహబూబ్‌నగర్‌ పట్టణం భగీరథకాలనీ, భూత్పూర్ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్​ ఆకస్మికంగా సందర్శించారు. పీహెచ్​సీలో వ్యాక్సినేషన్‌ జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. అనంతరం రాజాపూర్ పీహెచ్​సీలో ఆకస్మిక తనిఖీలు చేశారు.

ఈ క్రమంలో రాజాపూర్​ పీహెచ్​సీలో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వైద్యుడు లేకపోవడాన్ని కలెక్టర్​ గమనించారు. వ్యాక్సినేషన్​పై నిర్లక్ష్యం వహించినందుకు గాను సదరు పీహెచ్​సీ డాక్టర్. ప్రతాప్ చౌహన్‌ను కలెక్టర్‌ వెంకట్రావు సస్పెండ్ చేశారు. వైద్యాధికారులు, ప్రత్యేకాధికారులు వ్యాక్సినేషన్​పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. పీహెచ్​సీ సిబ్బంది, వైద్యులు ఉదయమే గ్రామాలకు వెళ్లాలని.. టీకా వేసుకోని వారిని గుర్తించి వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్ పట్ల పీహెచ్​సీ వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

ఇదీ చదవండి: DH on Omicron : ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉంది... తస్మాత్ జాగ్రత్త

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.