ETV Bharat / state

తెలంగాణ దేశానికే ఆదర్శం: మంత్రి శ్రీనివాస్​గౌడ్

మహబూబ్​నగర్ జిల్లాలో జరిగిన రాష్ట్రావతరణ వేడుకల్లో మంత్రి శ్రీనివాస్​గౌడ్ పాల్గొన్నారు. అమలవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్​లో జాతీయ జెండా ఎగురవేశారు.

author img

By

Published : Jun 2, 2020, 3:33 PM IST

Updated : Jun 2, 2020, 3:38 PM IST

state-formation-day-celebrations-in-mahabubnagar
తెలంగాణ దేశానికే ఆదర్శం: మంత్రి శ్రీనివాస్​గౌడ్
'ఉమ్మడి పాలమూరును సస్యశ్యామలం చేస్తం'

దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా తెలంగాణ పాలన కొనసాగుతోందని.. అన్నిరంగాల్లో తనదైన శైలిలో రాష్ట్రం దూసుకుపోతోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్​నగర్ జిల్లాలో జరిగిన రాష్ట్రావతరణ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తొలుత పట్టణంలోని అమలవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్​లో జాతీయ జెండా ఎగురవేశారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ లాంటి ఎన్నో పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు.

"పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తాం. ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ఎన్ని కేసులు వేసినా ప్రాజెక్టు పూర్తవుతుంది. రూ. 10వేల కోట్లతో ఈ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కొందరు నాయకుల వల్ల పనుల్లో కొంత జాప్యం ఏర్పడింది."

- మంత్రి శ్రీనివాస్​గౌడ్

ఇవీ చూడండి: 'తెలంగాణను ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం'

Last Updated : Jun 2, 2020, 3:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.