మనుషులే కాదు.. ప్రకృతిలో చిన్న ప్రాణి కూడా రక్షణ కోసం తనదైన వ్యూహాలను అమలు చేస్తుంది. శత్రువులకు కనిపించకుండా కొండ వెనక నక్కినట్లుగా ఈ పావురాలు.. బండరాయిపై ఏటవాలుగా ఉన్న వైపు ఒదిగి కూర్చున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర పెద్దచెరువు సమీపంలో ఈ దృశ్యం చూపరులను ఆకట్టుకుంటోంది.

ఏ ఆహారం లభించని చోట, గూళ్లు లేని చోట అవి ఎందుకిలా కూర్చున్నాయని సందేహం వచ్చిందా? ఈ విషయంపై జీవశాస్త్ర సహాయ ఆచార్యులు బక్షి రవీందర్‌రావుని సంప్రదించగా.. శత్రువులు దాడి చేస్తాయని భావించినప్పుడు పావురాలు ఇలా నక్కి తమను తాము కాపాడుకొంటాయని తెలిపారు. సాధారణంగా పావురాలపై గద్దలు, డేగలు దాడులు చేస్తుంటాయని, వాటి నుంచి రక్షణకు ఇలా దాక్కుంటాయని వెల్లడించారు.
ఇదీ చూడండి: విద్యుత్ రంగంలో సంస్కరణలు తెస్తేనే ఇక అప్పులు!