ETV Bharat / state

తెంపితే కష్టం.. తెంపకుంటే నష్టం.. మామిడి రైతుల దయనీయ స్థితి - మామిడి రైతుల కష్టాలు

losses for Nagar Kurnool Mango Farmers : ఉమ్మడి పాలమూరు జిల్లాలో మామిడి రైతులు ఎన్నడూ లేని కష్టాలను ఎదుర్కొంటున్నారు. తెగుళ్ల దాడితో దిగుబడి సగానికి పైగా పడిపోగా.. వడగళ్ల వానలు మరిన్ని కష్టాల ఊబిలోకినెట్టాయి. కాయ నాణ్యత లేక మార్కెట్​లో ధర పలకడం లేదు. మార్కెట్ సౌకర్యం లేక దళారులు చెప్పిందే ధరగా అమలవుతోంది. దిగుబడి తగ్గిందని హైదరాబాద్‌ తీసుకువెళ్లినా గిట్టు బాటయ్యే పరిస్థితిలేదని రైతులు వాపోతున్నారు.

Mango farmers who are suffering
నష్టపోతున్న మామిడి రైతులు
author img

By

Published : Apr 12, 2023, 8:01 AM IST

దిగుబడి లేక నష్టపోతున్న మామిడి రైతులు

losses for Nagar Kurnool Mango Farmers : చెట్టు నుంచి తెంపితే కష్టం.. తెంపకుంటే నష్టం అన్నట్లుగా మారిపోయింది.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా మామిడి రైతులు నష్టాల ఊబిలో చిక్కుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో సాగయ్యే కొల్లాపూర్ మామిడికి దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన ఫలాన్ని పండిస్తున్న రైతులు మాత్రం మూడేళ్లుగా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ఈసారి ఆనష్టాల తీవ్రత మరింత పెరిగింది.

దిగుబడి 30 శాతానికి పడిపోయింది: నల్ల తామర ఇతర చీడపీడలతో అసలు పూతే నిలవలేదు. వాటిని అరికట్టేందుకు రైతులు పెద్ద ఎత్తున పురుగుమందులు, ఎరువులు వాడటంతో పెట్టుబడులు పెరగ్గా.. కూత మాత్రం రాలేదు. దిగుబడులు 30 శాతానికి పడిపోయాయి. ఈమధ్య కురిసిన వడగళ్ల వానకి చాలావ చోట్ల మామిడి రాలిపోవటంతో ఉన్న దిగుబడి తగ్గిపోయింది. వచ్చిన పంటను అమ్ముకుందామంటే మార్కెట్లో మామిడికి రేటే లేకుండాపోయింది.

వాస్తవ ధర కన్నా చాలా తక్కువకు పడిపోయిన మామిడి ధర: వాస్తవానికి దిగుబడి తగ్గినప్పుడు డిమాండ్ పెరిగి రేటుపెరగాలి కానీ అందుకు భిన్నంగా ఈసారి ధరలు దారుణంగా పడిపోయాయి. పెట్టిన పెట్టుబడి వచ్చినా.. దిగుబడి చూస్తే క్వింటాకు 60 నుంచి 70 వేల వరకు పలికితే తప్ప గిట్టుబాటు కాదని.. అలాంటిది 25 నుంచి 30 వేలు పలికితే పెట్టుబడులు చేతికి రావని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగుబడి తగ్గిపోవడంతో పంటను హైదరాబాద్ వంటి మార్కెట్లకి తరలించే పరిస్థితి లేకుండా పోయింది. కొల్లాపూర్‌లో మార్కెట్ సౌకర్యం లేకపోవటంతో దళారులు చెప్పిన ధరకు రైతులు అమ్ముకోవాల్సి వస్తుంది. కొల్లాపూర్ నియోజకవర్గంలో 22 వేల వరకు ఎకరాల వరకు మామిడి తోటలు ఉండగా వాటిని కౌలురైతులే గుత్తకు తీసుకుంటారు. అలాంటి కౌలురైతులంతా ఈసారి పెద్ద ఎత్తున నష్టపోయారు.

నాణ్యత లేనందునే ధర తగ్గిపోయింది: పెద్ద కొత్తపల్లి, కల్వకుర్తి లాంటి ప్రాంతాల్లో వ్యాపారులు మామిడి మార్కెట్ ఏర్పాటు చేసినా వారు చెప్పిన రేటుకే అమ్మాల్సిన దుస్థితి ఏర్పడింది. వ్యాపారులు మాత్రం ఖమ్మం, వరంగల్ ఇతర ప్రాంతాల్లో దిగుబడి బాగా ఉందని అక్కడి మామిడికి రేటు బాగా పలుకుతుందని చెబుతున్నారు. నాగర్‌కర్నూల్ ప్రాంతంలో పండిన పంట ఈసారి దెబ్బతిందని నాణ్యత లేకపోవడం వల్ల రేటు ఇవ్వలేకపోతున్నామని వ్యాపారి చెబుతున్నారు.

చేతులేత్తేసిన సెర్ప్: గతంలో సెర్ప్ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్, కల్వకుర్తి సహా.. ఇతర ప్రాంతాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే మామిడిని కొనుగోలు చేసింది. కానీ ఈసారి సెర్ప్ చేతులెత్తేసింది. సెర్ఫ్‌ ఇచ్చే ధరకి రైతులు అంగీకరించకపోవడంతో ఇక్కడ కొనుగోలు కేంద్రాలు తెరుచుకోలేదు. తెగుళ్లదాడి, పెరిగిన పెట్టుబడులు, పడిపోయిన దిగుబడి, సరైన మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం వంటి కారణాలతో సొంత తోటలున్న రైతులు తోటలని కౌలుకు తీసుకున్న వారు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి వరుసగా నష్టపోతున్న వారిని గుర్తించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.