ETV Bharat / state

ఇకపై ప్రతి గురువారం 'ప్రజా వేదిక': శ్రీనివాస్​ గౌడ్​ - praja vedika program in mahabubnagar

ఈ రోజు నుంచి 'ప్రజా వేదిక' కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అమలు చేయనున్నట్లు మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ ప్రకటించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రతి గురువారం ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. మహబూబ్​నగర్​లోని క్యాంపు కార్యాలయం నుంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

minister srinivas goud, praja vedika
మంత్రి శ్రీనివాస్​ గౌడ్​, ప్రజా వేదిక
author img

By

Published : Jan 28, 2021, 6:47 AM IST

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ఈ నెల 28 నుంచి 'ప్రజా వేదిక' కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అమలు చేయనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయం నుంచి ఈ గురువారమే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తన వద్దకు వచ్చిన ప్రతి ఫిర్యాదుదారుడికి సహాయం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజల సమస్యలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారాన్ని ఒక క్రమ పద్ధతిలో చేపట్టేందుకు గాను తన క్యాంప్ కార్యాలయంలో సిబ్బందిని నియమించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఇకపై ప్రతి గురువారం ప్రజావేదిక ఉంటుందని.. సంబంధిత వెబ్​సైట్​ను కూడా ఏర్పాటు చేస్తున్నామని శ్రీనివాస్​ గౌడ్​ అన్నారు. దరఖాస్తులను పోర్టల్ ద్వారా ఆయా శాఖల అధికారులకు పంపించడం జరుగుతుందని చెప్పారు. ప్రజా వేదికపై అధికారులతో తాను స్వయంగా సమీక్ష చేస్తానని మంత్రి వెల్లడించారు.

ఇదీ చదవండి: సిద్దిపేటలో అర్బన్‌​ పార్కును ప్రారంభించనున్న హరీశ్​ రావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.