కరోనాపై ప్రజలు భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్ వార్డును పరిశీలించారు.
కరోనా పరిస్థితిని ముఖ్యమంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి సహా పలువురు అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని చెప్పారు. కరోనాపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. వాస్తవాలు కాకుండా వదంతులు వ్యాప్తి చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
ఇవీ చూడండి: కరోనాపై ప్రముఖుల ప్రచారం