ETV Bharat / state

కేటీఆర్​ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

ఈ నెల 13న మంత్రి కేటీఆర్​ మహబూబ్​నగర్​ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటన ఏర్పాట్లను మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ పరిశీలించారు. కేటీఆర్​ పర్యటన విజయవంతం అయ్యే అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Minister Srinivas Goud reviewed the arrangements for the KTR tour in mahabubnagar
కేటీఆర్​ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్​ గౌడ్​
author img

By

Published : Jul 7, 2020, 8:57 PM IST

మహబూబ్​నగర్ జిల్లాలో ఈ నెల 13న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ పర్యటన విజయవంతం అయ్యేలా అన్ని చర్యలు చేపట్టాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. కేటీఆర్​ పర్యటనలో భాగంగా స్థానిక మయూరి పార్కులో నిర్వహించే హరితహారం ఏర్పాట్లను పరిశీలించారు. పర్యటన ప్రణాళికలో మార్పులు చేర్పులను సంబంధిత అధికారులకు సూచించారు. జడ్పీ మైదానంలో చేసిన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.

తొలుత మహబూబ్​నగర్​లోని తెలంగాణ చౌరస్తా నుంచి జిల్లా కోర్టు రోడ్డు వరకూ జరుగుతున్న విస్తరణ పనులను పరిశీలించారు. ఎమ్మార్పీఎస్​ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ఏనుగొండ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఏనుగొండలోని అనాథ ఆశ్రమంలో మల్లెపోగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంత్రి అన్నదానం చేశారు.

ఇవీ చూడండి: వేరుశనగ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తాం: మంత్రి సింగిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.