ప్రజా సమస్యలను జాప్యం లేకుండా పరిష్కరించడమే లక్ష్యంగా ప్రజావేదికను ప్రవేశపెట్టినట్లు... మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రతి గురువారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉంటారని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్‌తో పాటు ఇతర జిల్లాల సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను సైతం స్వీకరించనున్నట్లు మంత్రి తెలిపారు. వాటిని ఆయా జిల్లాల సంబంధిత అధికారులకు పంపిస్తున్నామని అన్నారు. ప్రజావేదికలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కారిస్తున్నామని... వెంటనే పరిష్కారం కాని వాటికి సమయం ఇస్తున్నట్లు చెప్పారు. కిందటి వారం నిర్వహించిన కార్యక్రమంలో 58 దరఖాస్తులు రాగా.. వాటిని తక్షణమే పరిష్కరించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రైతుల ఉద్యమానికి తెలంగాణ అన్నదాతల మద్దతు: ఈటల