గడిచిన ఆరేళ్లలో మహబూబ్‌నగర్ జిల్లా అనేక రంగాల్లో పురోగతి సాధించిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. పలు ఉద్యోగ, కుల సంఘాలు, ప్రభుత్వ, ప్రైవేటు అసోసియేషన్లకు సంబంధించిన సమావేశాల్లో పాల్గొని క్యాలెండర్‌లను, డైరీలను ఆవిష్కరించారు.
పేద విద్యార్థులకు సహకారం అందించేందుకు అన్ని కులాలు, మతాల వారు ముందుకు రావాలని మంత్రి సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధిలో పురోగతి సాధిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు తెలంగాణ బీసీ మహాసభ ఆధ్వర్యంలో రెడ్‌క్రాస్ సమావేశ మందిరంలో నిర్వహించిన సావిత్రిబాయి పూలే 189వ జయంతి వేడుకలకు మంత్రి హాజరయ్యారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 238 కరోనా కేసులు, 2 మరణాలు