మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ, రూరల్ పోలీస్‌స్టేషన్, ఎస్వీఎస్ ఆసుపత్రి సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జి పనులు, మిషన్ భగీరథ పైప్‌లైన్ ఏర్పాట్లను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరిశీలించారు.
నిర్మాణాల పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి... చేపట్టవలసిన మార్పులను సూచించారు. పట్టణంలోని గడియారం, రాజీవ్ కూడలీలు, తెలంగాణ చౌరస్తాలో కొనసాగుతున్న జంక్షన్ల అభివృద్ది పనులను త్వరగతిన చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
మహబూబ్‌నగర్ పట్టణం వీరన్నపేటకు చెందిన ఇద్దరు యువకులు.. గతనెల కరెంట్ షాక్‌తో మృతి చెందారు. విద్యుత్ శాఖ నుంచి పది లక్షల రూపాయల ఎక్సగ్రేషియాను వారి కుటుంబ సభ్యులకు మంత్రి అందజేశారు.
ఇదీ చూడండి : కొందరి నిర్లక్ష్యంతో రెండు చేతులు కోల్పోయిన చిన్నారి