మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రజా వేదిక ఆన్లైన్ ఫిర్యాదుల కేంద్రాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రజా వేదికలో నమోదు చేసుకోవాలని మంత్రి సూచించారు. ఇక్కడ నమోదు చేసుకున్న ఫిర్యాదులకు... సత్వరమే పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తన క్యాంప్ కార్యాలయంలో ప్రతి గురువారం ప్రజా వేదికను నిర్వహిస్తామని వివరించారు. వచ్చిన ఫిర్యాదులను క్రమ పద్ధతిలో నమోదు చేసుకుని.. సంబంధిత అధికారులకు పంపించడమే కాకుండా... సత్వర పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నెలలో వచ్చిన ఫిర్యాదులపై ఒకసారి జిల్లా స్థాయి అధికారులతో సమీక్షిస్తామన్నారు.
ఇదీ చూడండి: నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో భృతి: కేటీఆర్