ETV Bharat / state

పిడుగుపాటు బాధిత కుటుంబానికి మంత్రి సాయం - పిడుగుపాటు బాధిత కుటుంబానికి మంత్రి సాయం

పిడుగుపాటుకు గురై చనిపోయిన బాధిత కుటుంబాన్ని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ పరామర్శించారు. వారికి ఖర్చుల నిమిత్తం 40 వేల చెక్కుతో పాటు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. వారి పిల్లలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రైతుబీమాతో పాటు 17 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని త్వరలో అందిస్తామని మంత్రి తెలిపారు.

minister srinivas goud helps to one family in mahabubnagar district
పిడుగుపాటు బాధిత కుటుంబానికి మంత్రి సాయం
author img

By

Published : May 1, 2020, 11:58 PM IST

గత నెల 28న పిడుగుపాటుకు గురై చనిపోయిన మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి ఖర్చుల నిమ్మిత్తం 40వేల చెక్కుతో పాటు నిత్యావసర సరకులను అందజేశారు. మహబూబ్‌నగర్‌ మండల పరిధిలోని రోళ్లగడ్డ తండాకు చెందిన భీమ్లా నాయక్, సరోజ దంపతులు మంగళవారం కురిసిన వర్షానికి పిడుగుపాటుకు గురై మరణించారు. పిడుగుపాటుకు రైతు కుటుంబం మృతి చెందడం దురదృష్టకరమని మంత్రి అన్నారు. వారి పిల్లలను ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని, రెసిడెన్షియల్‌ పాఠశాలలో చేర్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రైతుబీమాతో సహా ఆ కుటుంబానికి మొత్తం 17 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని త్వరలోనే అందిస్తామని మంత్రి వెల్లడించారు. అంత్యక్రియలకు అయిన ఖర్చుకు సంబంధించి ఒక్కొక్కరికి 20 వేల రూపాయల చొప్పున 40 వేల రూపాయల చెక్కును తల్లి ముత్యాలమ్మకు అందజేశారు.

రైతులు వ్యవసాయ పనులలో ఉన్నప్పుడు పూర్తిగా జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా వర్షాలు కురిసే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సూచించారు. కరోనా వల్ల లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ జిల్లాలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు.

ఇవీ చూడండి: 'ధాన్యం కొనుగోళ్లపై విపక్షాల రాద్ధాంతం సరికాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.