ETV Bharat / state

'ధాన్యం కొనుగోళ్లపై విపక్షాల రాద్ధాంతం సరికాదు' - ముఖ్యమంత్రి కేసీఆర్​

ధాన్యం సేకరణ విషయంలో విపక్షాలు రాద్ధాంతం చేయడం సరికాదని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్​ మారెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏ రాష్ట్రంలో లేని రీతిలో తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని చెప్పారు. ఈ విషయంపై గవర్నర్​ వద్దకు వెళ్లి ఫిర్యాదులు చేస్తున్న విపక్ష నేతలు... క్షేత్రస్థాయిలో వాస్తవాలు గ్రహించాలని ధ్వజమెత్తారు.

civil supply chairman maareddy srinivasreddy comments on bjp and congress
'ధాన్యం కొనుగోళ్లపై విపక్షాలు రాద్ధాంతం చేయడం సరికాదు'
author img

By

Published : May 1, 2020, 8:15 PM IST

ఈ ఏడాది యాసంగి మార్కెటింగ్ సీజన్‌లో ధాన్యం సేకరణ విషయంలో విపక్షాలు రాద్ధాంతం చేయడం సరికాదని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి ఆక్షేపించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనిరీతిలో తెలంగాణలో ప్రతి గింజ కొంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు ధాన్యం కొనుగోళ్లు చురుకుగా సాగుతున్న తరుణంలో... కాంగ్రెస్, భాజపాలు విమర్శలు చేయడం తగదని ఆరోపించారు. కొనుగోళ్లలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ... అవన్నీ అధిగమించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 21.27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా... డబ్బు చెల్లింపుల కోసం 1497 కోట్ల రూపాయలు విడుదల చేశామని ప్రకటించారు. వరి పంట కొన్న తర్వాత 24 గంటల్లో ఆన్‌లైన్‌లో రైతులకు డబ్బులు చెల్లిస్తున్నామని చెప్పారు.

ఇంత సాఫీగా సాగుతుంటే ధాన్యం సేకరణ విషయంపై గవర్నర్ వద్దకు వెళ్లి ఫిర్యాదులు చేస్తున్న భాజపా నేతలు... క్షేత్రస్థాయిలో వాస్తవాలు గ్రహించలేకపోతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వంపై వెయ్యి కోట్ల రూపాయలు భారం పడుతున్నా కూడా రైతులు నష్టపోకుండా ఉండాలన్న లక్ష్యంతో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఏ గ్రామంలో పంట ఆ గ్రామంలోనే కొనుగోలు చేస్తున్న దృష్ట్యా... తాలు, రవాణా, నిల్వ, హమాలీలు వంటి ఇబ్బందులు ఉన్నాసరే అవన్నీ అధిగమిస్తున్నామని వివరించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ కార్డుదారులందరికీ ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభించామని, రేపట్నుంచి 1500 రూపాయల నగదు బదిలీ సాగబోతున్నందున ఏ కుటుంబం కూడా భయపడాల్సిన అవసరం లేదని మారెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: తెలంగాణలో రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్​జోన్ జిల్లాలివే...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.