మహబూబ్నగర్లో అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలు నిర్వహించే రీతిలో పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని సాంస్కృతిక, పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన అంతర్జాతీయ పతంగుల పండుగలో కలెక్టర్ రొనాల్డ్ రోస్తో పాటు మంత్రి హాజరయ్యారు. గాలిపటాలను ఎగరేసి అందరినీ ఉత్సాహపరిచారు.
వచ్చే ఏడాది పతంగుల పండుగను మరింత ఘనంగా నిర్వహిస్తామన్నారు. థాయ్లాండ్, టర్కీ, శ్రీలంక దేశాల నుంచి వచ్చిన వారు గాలిపటాలను ఎగరేశారు. ఈమోజీ, డ్రాగన్, గుడ్లగూబ వంటి విభిన్న ఆకారాల్లోని పతంగులు ఆకాశంలో విహరించి వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.
ఇవీ చూడండి : 'మకరజ్యోతి' దర్శనం.. భక్తజన పరవశం