ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, వైద్య, నర్సింగ్ కళాశాల నిర్మాణ ప్రదేశాలను ఉన్నతస్థాయి వైద్య బృందం సందర్శించింది. మహబూబ్‌నగర్ పాత కలెక్టరేట్ ప్రాంగణంలో రూ.300 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించనున్నారు.
ముఖ్యమంత్రి ఓఎస్డీ గంగాధర్, డీఎంఈ రమేశ్‌రెడ్డి, టీఎస్ఎమ్ఐఎస్డీ-ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి నేతృత్వంలోని బృందం పాత కలెక్టరేట్‌ను పరిశీలించింది. అక్కడ జనరల్ ఆసుపత్రి, సిబ్బంది నివాసాలు, నర్సింగ్ కళాశాల, పార్కింగ్‌కు అనువైన ప్రాంతాలకు సరిపడా వసతులు ఉన్నాయో తెలుసుకునేందుకు కలియతిరిగారు. అక్కడి నుంచి వనపర్తి చేరుకున్న బృందం కలెక్టర్ యాస్మిన్ బాషాతో సమావేశమయ్యారు.
వనపర్తి జిల్లాలో నిర్మించ తలపెట్టిన ప్రభుత్వ వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాలకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. అన్నిసౌకర్యాలతో 2 నెలల్లో కళాశాల నిర్మాణాన్ని పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిని బృందం సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం నాగర్‌కర్నూల్ చేరుకున్న బృందం... వైద్య కళాశాల కోసం కేటాయించిన ఉయ్యాలవాడలోని 30 ఎకరాల స్థలాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది.
ఇదీ చూడండి: SRINIVAS GOUD: మహబూబ్‌నగర్‌లో రూ.300కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి