నియంత్రిక వద్ద ఫ్యూజు వైరు వేసేందుకు వెళ్లిన ఓ యువకుడు విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా మదనాపురం మండలం అజ్జకొల్లు సమీపంలోని ఎర్రగట్టు వద్ద జరిగింది.
రామన్పాడుకు చెందిన కురుమూర్తి.. మరో యువకుడితో ఎర్రగట్టు వద్ద ఫ్యూజు వైర్ వేసేందుకు వెళ్లాడు. వైరు వేస్తున్న క్రమంలో విద్యుత్ సరఫరా కావడం వల్ల కురుమూర్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: ప్రైవేటు ఉద్యోగుల వేతనాలపై నేడు సుప్రీం కీలక తీర్పు