ETV Bharat / state

యథేచ్ఛగా ఇసుక దందా.. అడ్డొచ్చిన వారిపై దాడులు

మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులుపేట మండలం జయపురం శివారు ఆకేరువాగు నుంచి ఒకేరోజు 250 ట్రాక్టర్లలో ఇసుక తరలింపునకు తహసీల్దార్​ అనుమతించగా.. విచారణ జరిపిన కలెక్టరు గౌతమ్‌ రెండు వారాల క్రితం తహసీల్దార్​ను సస్పెండ్‌ చేసి డిప్యూటీ తహసీల్దార్​, ఆర్‌ఐపై బదిలీ వేటు వేశారు. కొత్తగా వచ్చిన తహసీల్దార్​ ఇసుక దందా ఒత్తిడి తట్టుకోలేక సెలవు పెట్టేశారు. ఈ వాగులో రూ.3 కోట్లతో కట్టిన చెక్‌డ్యాం కూలిపోయింది. ఇసుక అక్రమ తవ్వకాలే దీనికి కారణమన్న ఆరోపణ ఉంది. మహబూబాబాద్‌లోని ఓ మండలంలో 22 మంది సర్పంచుల్లో 15 మంది ఇసుకదందా సాగిస్తున్నారు. సెప్టెంబరు 24న ఇసుక ట్రాక్టరు ఢీకొని ఒక వ్యక్తి మరణించగా, మరొకరు గాయపడ్డారు.

illegal sand transport in mahabubabad district
యథేచ్ఛగా ఇసుక దందా
author img

By

Published : Nov 12, 2020, 6:57 AM IST

Updated : Nov 12, 2020, 11:46 AM IST

వాగులు, వంకలు, నదుల్లోని ఇసుకను కొందరు కొల్లగొడుతున్నారు. గతంలో రాత్రిళ్లు రహస్యంగా నడిచిన ఇసుక దోపిడీ ఇప్పుడు పట్టపగలే సాగుతోంది. వరద ప్రవాహంలోనూ వారు తగ్గడంలేదు. ఇటీవల మహబూబ్‌నగర్‌ జిల్లా మాగనూరు మండలంలో పెద్దవాగు నుంచి ట్రాక్టరులో ఇసుక తరలిస్తుండగా అడ్డుకున్న స్థానిక పట్టాదారుకు తీవ్ర గాయాలయ్యాయి. పలుచోట్ల ఇసుక అక్రమ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. అడ్డొచ్చినవారిపై దాడులకు, బెదిరింపులకు తెగబడుతున్నారు. కొన్నిచోట్ల ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల పేరుతో టోకెన్లు తీసుకుని అక్రమంగా ఇసుక తోడేస్తుండగా, మరికొన్నిచోట్ల ఎలాంటి అనుమతి లేకుండానే ఇసుకను కొల్లగొడుతున్నారు. దానిని హైదరాబాద్‌కు, చుట్టుపక్కల జిల్లా కేంద్రాలకు లారీల్లో తరలిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ) ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయాలు జరుపుతోంది. వేసవిలో రోజుకు 40,000 క్యూబిక్‌ మీటర్లు అందుబాటులో ఉండే ఇసుక వర్షాకాలం, వరదల ప్రభావంతో.. పదోవంతు కూడా సరఫరా చేయట్లేదు. ఆన్‌లైన్‌ బుకింగ్‌ పరిమాణం ఎక్కువుండటం, గ్రామీణులకు ఆన్‌లైన్‌ బుకింగ్‌పై అవగాహన లేకపోవడం కూడా అక్రమ దందాకు కారణాలవుతున్నాయి.

ప్రభుత్వ ఆదాయానికి గండి:

అక్రమ అమ్మకాల వల్ల ప్రభుత్వ ఆదాయం చేజారిపోతోంది. అక్రమార్కులు భారీగా సంపాదిస్తున్నారు. వ్యవసాయానికి వాడాల్సిన ట్రాక్టర్లను ఇసుకకు వాడుతున్నారు. రహదారులు దెబ్బతింటున్నాయి. ప్రమాదాలు జరుగుతున్నాయి.

పరిష్కారాలేంటి?

టీఎస్‌ఎండీసీ ఆన్‌లైన్‌ ఇసుక సరఫరా పెరగాలి. హైదరాబాద్‌లో మాదిరే జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో నిల్వ కేంద్రాలు ఏర్పాటుచేయాలి. తక్కువ పరిమాణంలోనూ సరఫరా చేయాలి.

చిచ్చురేపుతున్న ఇసుక

నారాయణపేట జిల్లా: పెద్దవాగు తీరంలో 25 కి.మీ. మేర, ముఖ్యంగా మక్తల్‌ కేంద్రంగా ఇసుకదందా సాగుతోంది. టిప్పర్‌ రూ. 40,000కు, ట్రాక్టరు ఇసుక రూ. 6,000కు విక్రయిస్తున్నారు.

* మూణ్నెళ్లక్రితం జలాల్‌పూర్‌లో ఇసుక డంపు వద్ద గొడవలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్టోబరులో జిన్నారం మన్నెవాగు నుంచి ఇసుకను తరలిస్తుంటే గొడవ జరిగింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో దుందుభి వాగు, తుంగభద్ర నదిలో అక్రమ దందా అధికంగా ఉంది.

రాజన్నసిరిసిల్ల జిల్లా: ముస్తాబాద్‌, ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి, సిరిసిల్ల, బోయినపల్లి, ఇల్లంతకుంట, వేములవాడ మండలాల్లో ఇసుకదందా అధికం. అక్టోబరులో రాజరాజేశ్వర జలాశయం పరిశీలనకు వచ్చిన జిల్లా కలెక్టరు కృష్ణభాస్కర్‌ మానేరువాగులో వందల సంఖ్యలో ట్రాక్టర్లు చూసి ఆశ్చర్యపోయారు. పది ట్రాక్టర్లకు అనుమతి ఉంటే.. వందల్లో నడుస్తున్నట్లు తేలింది.

ఉమ్మడి వరంగల్‌ జిల్లా: ఆకేరు వాగు పరీవాహక ప్రాంతంలోని 10 మండలాల్లో నిత్యం వందల ట్రాక్టర్లతో ఇసుక అక్రమంగా తరలుతోంది. కొందరు ఇసుకదందా కోసం ఏకంగా ఆకేరువాగు ఒడ్డున పొలాల్ని కొనేస్తున్నారు.

* వర్దన్నపేట మండంలోని ఓ గ్రామంలో ప్రతి 2, 3 ఇళ్లకు ఓ ఇసుక ట్రాక్టరు ఉంది. కొత్తపల్లిలో 1000 కుటుంబాలుంటే 300 వరకు ట్రాక్టర్లు ఉన్నాయి. కట్రియాల్‌, ఇల్లెందలో గ్రామానికి 300 చొప్పున ఉన్నాయి.

ఉమ్మడి నల్లొండ జిల్లా: మూసీ, పాలేరువాగులోంచి భారీగా ఇసుక తరలిపోతోంది. జాజిరెడ్డిగూడెం, శాలిగౌరారం, మిర్యాలగూడెం గ్రామీణ మండలంలో దందా ఎక్కువగా సాగుతోంది. మిర్యాలగూడ నుంచి రోజుకు 400కుపైగా ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు పెన్‌గంగలో, జైనథ్‌, బేల మండలాల్లో భారీగా అక్రమరవాణా సాగుతోంది. ఈ జిల్లాలో పలికేరు వాగు నాణ్యమైన ఇసుకకు పేరొందడంతో అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. ప్రభుత్వ భవనానికి ఇసుక అనుమతి పత్రం అడ్డం పెట్టుకుని ఓ గుత్తేదారు రూ. కోట్ల విలువైన ఇసుక తరలించినట్లు ఆరోపణలున్నాయి. గోదావరి పెద్దవాగు నుంచి భారీగా ఇసుక వెళుతోంది.

దళారుల వేలం ఎత్తుగడ

స్థానికుల నుంచి వ్యతిరేకత రాకుండా దళారులు గ్రామాభివృద్ధి పేరుతో పంచాయతీలకు కొంత మొత్తాన్ని ముట్టజెబుతూ.. ప్రతి ట్రాక్టరు నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. నర్సింహులుపేట మండలంలోని ఓ గ్రామంలో ప్రతి 3 నెలలకు ఓసారి వేలంపాట నిర్వహిస్తున్నారు. ప్రతి ట్రాక్టరు నుంచి రూ.400 వసూలు చేస్తున్నారు.

ఓ కలెక్టరు చొరవ

మహబూబూబాద్‌ జిల్లాలో ఇసుక అక్రమదందా కట్టడిపై కలెక్టరు గౌతమ్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు. గోదావరి ఇసుక తెప్పించి.. జిల్లా కేంద్రంలో నిల్వచేసి స్థానికంగా అవసరమైన వారికి సరఫరా చేస్తున్నారు. రెవెన్యూ అధికారులిచ్చే ఇసుక కూపన్లు పక్కాగా ప్రభుత్వ అవసరాలకే పరిమితం చూస్తూ.. ప్రైవేటు అవసరాలకు గోదావరి ఇసుక కొనుక్కోవాలని స్పష్టం చేస్తున్నారు.

* రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో ఇసుక ట్రాక్టరు యూనియన్లను నిరోధించే నాథుడే లేరు. ఒక్కో గ్రామంలో 50-100 ట్రాక్టర్లున్నాయి. వీటిలో ప్రభుత్వం రైతులకు రాయితీపై అందజేసినవి కూడా ఉండడం విశేషం.

* సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలో మూసీలో ప్రవాహం ఉన్నప్పటికీ అక్రమార్కులు నీళ్లలోనే ఇసుకను తోడేస్తున్నారు. నిత్యం 80కి పైగా ట్రాక్టర్లలో ఇసుక తరలిపోతోంది. కొద్దివారాల క్రితం ఒకేరోజు 39 ట్రాక్టర్లను పట్టుకుని పోలీసులు కేసులు పెట్టినా దందా ఆగట్లేదు. తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలో మూసీని ఆనుకున్న రెండు గ్రామాల్లో గ్రామ, మండలస్థాయి ప్రజాప్రతినిధుల్లో సుమారు 40 శాతంమందికి ట్రాక్టర్లున్నాయి. వాటిలో సగానికి పైగా ఇసుక కోసమే.

Last Updated : Nov 12, 2020, 11:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.