దిశ కేసులో ఎన్‌కౌంటర్‌కి గురైన చెన్నకేశవులు భార్య రేణుక ఆడపిల్లకు జన్మనిచ్చింది. 9 నెలలు నిండిన రేణుకకు నొప్పులు రాగా... గురువారం మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చేర్పించారు. సాధారణ కాన్పు నిమిత్తం వైద్యులు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాకపోవటం వల్ల... శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితి బాగున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం గుడిబండకు చెందిన చెన్నకేశవులు ఎన్కౌంటర్ జరిగిన సమయంలో రేణుక 6 నెలల గర్భవతి. పన్నెండేళ్ల వయసులోనే రేణుకకు వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె వయసు 14 ఏళ్లు.