ETV Bharat / state

చిరుత దాడిలో దూడ మృతి.! భయాందోళనలో ప్రజలు

మహబూబ్​నగర్​ జిల్లాలో చిరుత హడలెత్తిస్తోంది. పొలాల్లో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. తాజాగా చిరుతదాడి చేసి బర్రె దూడను హతమార్చడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. దూడ మృతదేహన్ని పరిశీలించిన అటవీశాఖ అధికారులు చిరుత ఆనవాళ్లు కనిపించలేదని చెబుతున్నారు.

leopard in mahaboobnaga
చిరుత దాడిలో దూడ మృతి.!
author img

By

Published : Jan 2, 2021, 7:47 AM IST

మహబూబ్​నగర్​ జిల్లాలో చిరుత కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గ్రామీణ మండలంలోని జమిస్తాపూర్​ గ్రామ సమీపంలో ఓ బర్రె దూడను చంపేసింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అటవీశాఖ అధికారులు చిరుత సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు దొరకలేదని చెబుతున్నారు.

గ్రామానికి చెందిన రామచంద్రయ్య తన పొలం వద్ద ఉంచిన దూడను చిరుత చంపేసినట్లు ఫిర్యాదు చేశాడు. సమీపంలోని మన్యంకొండ పరిసర ప్రాంతాల్లో చిరుతలు సంచరిస్తున్నట్లు గతనెలలో రైతులు అధికారుల దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం చిరుత గుర్తులు కనిపించకపోవడంతో హైనా అయి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పశువులపై దాడి చేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి : 70లక్షల మందికి టీకాలు ఇవ్వడమే సవాల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.