ETV Bharat / state

బ్యాంకు ఖాతాదారుల సేవా మహోత్సవాలు - Bank Customer Service Celebrations

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో వినియోగదారులకు రుణాలు అందించేందుకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఖాతాదారుల సేవా మహోత్సవాలు నిర్వహిస్తున్నారు.

బ్యాంకు ఖాతాదారుల సేవా మహోత్సవాలు
author img

By

Published : Oct 25, 2019, 10:39 AM IST

వినియోగదారులకు రుణాలు అందించేందుకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఖాతాదారుల సేవా మహోత్సవాలు నిర్వహిస్తున్నామని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఓమ్‌ ప్రకాశ్‌ మిశ్రా పేర్కొన్నారు. భారత ప్రభుత్వం ఆదేశానుసారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో బ్యాంకులు అందించే సేవలను... వినియోగదారులు అర్థం చేసుకునే విధంగా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. వినియోగదారులకు అన్ని రకాల రుణాల మంజూరుకు సులభంగా ఉండేందుకు బ్యాంకులన్నిటినీ ఒకే దగ్గరకు చేర్చినట్లు పేర్కొన్నారు. రైతులు సకాలంలో రుణాలను రెన్యూవల్‌ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. లేని పక్షంలో వారు నష్టపోవాల్సి వస్తుందని ఆంధ్రాభ్యాంక్‌ జోనల్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ మధు అన్నారు. ప్రభుత్వం రుణామాఫీ ప్రకటిస్తుందనే రైతులు రెన్యూవల్‌ చేసుకోవడం లేదని.. ఇలాంటి వాటి వల్ల భ్యవిషత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. సుమారు 32 బ్యాంకుల ద్వారా 25 కోట్ల వరకు మంజూరైన రుణాలను వినియోగదారులకు అందించారు.

బ్యాంకు ఖాతాదారుల సేవా మహోత్సవాలు

ఇవీ చూడండి: కర్తార్​పుర్​, కశ్మీర్​ మధ్యవర్తిత్వంపై అమెరికా కీలక వ్యాఖ్యలు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.