ETV Bharat / state

నీళ్లు, నిధులు, నియామకాలు.. ఎక్కడ? - మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో తెతెదేపా సమావేశం

నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ యువత పోరాటం చేస్తే.. సాధించుకున్న తర్వాత ఆ అంశాలకు ప్రాధాన్యత లేకుండా పోయిందని తెతెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొత్తకోట దయాకర్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్‌పై మండిపడ్డారు.

At a meeting held in the Mahabubnagar district center, KCR was furious
నీళ్లు, నిధులు, నియామకాలు..ఎక్కడ?
author img

By

Published : Jun 2, 2020, 10:52 PM IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆరేళ్లలో కేసీఆర్‌ ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదని తెతెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొత్తకోట దయాకర్‌రెడ్డి మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్‌పై మండిపడ్డారు. గత ప్రభుత్వాలు ప్రారంభించిన ప్రాజెక్ట్‌లనే పూర్తి చేసి చూపించారని ఎద్దేవా చేశారు.

పాలమూరులో కరవు..

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు లాభం చేకూర్చే విధంగా రెండేళ్లలో పూర్తి చేసేందుకు పాలమూరు - రంగారెడ్డి పథకంను ప్రారంభించినా.. నేటికి పనులలో పురోగతి లేదని దయాకర్‌రెడ్డి విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి పథకంలో అంతరాష్ట్ర వివాధాలు తలెత్తే పరిస్థితి ఉందని.. జూరాల నుంచి చేపట్టాలని చెప్పినా పట్టించుకోలేదన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ పూర్తిగా విస్మరించారని దుయ్యబట్టారు.

లక్ష ఉద్యోగ నియమాకాలు..?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరు సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఉద్యమ సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చెేయలేదని దయాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఒక లక్ష 7 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినా... ఈ ఆరేళ్లలో కేవలం 27వేల ఉద్యోగాలకు మాత్రమే నియమాకాలు జరిగాయన్నారు.

ఇదీ చూడండి: సీఎం కేసీఆర్​కి రైతన్న బహుమానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.