నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం నాలుగు వార్డుల్లో అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ఐదో వార్డులో తెరాస అభ్యర్ధి వనజ ఏకగ్రీవమయ్యారు. నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలో పదోవార్డులో తెరాస అభ్యర్ధిగా నామపత్రం దాఖలు చేసిన అనిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఉపసంహరణకు ముందే వనపర్తి మున్సిపాలిటీ ఐదో వార్డు తెరాస అభ్యర్థి శాంతమ్మ, అలంపూర్ మున్సిపాలిటీలో ఐదో వార్డు అభ్యర్ధి దేవన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అందరూ తెరాస అభ్యర్థులే కావటం గమనార్హం.
ఇవీచూడండి: పాలమూరులో రసవత్తరంగా పుర ఎన్నికలు