మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని వినోభానగర్‌లో రూ.6 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ బిందు శంకుస్థాపన చేశారు. అనంతరం మొక్కలు నాటి హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటి శంకుస్థాపన ఇదేనని... మున్ముందు 15వ ఆర్థిక సంఘం నిధులతో ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు.
మంత్రి సత్యవతి రాథోడ్ సహకారంతో సీతారామ ప్రాజెక్టు ద్వారా బయ్యారం పెద్ద చెరువు, తులారం ప్రాజెక్టులకు నీటిని రప్పించి ఈ ప్రాంతం సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బయ్యారం పీఏసీఎస్ అధ్యక్షులు శ్రీమూల మధుకర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: తెలంగాణలో ఆకలి చావుల్లేవు: హైకోర్టు