మహబూబాబాద్ ఎంపీగా మాలోత్ కవిత గెలుపొందడాన్ని హర్షిస్తూ డోర్నకల్‌లో తెరాస నాయకులు సంబురాలు జరుపుకున్నారు. స్థానిక గాంధీ కూడలి వద్ద టపాసులు కాల్చారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. తెరాసతోనే అభివృద్ధి సాధ్యమంటూ ప్రజలు పార్టీని ఆదరించి గెలిపించారని తెరాస నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో తెరాస జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: సర్వేలకు దూరంగా ఉంటా: లగడపాటి