ETV Bharat / state

మార్చిలో పెట్టనున్న బడ్జెట్​లో 2 పెద్ద పథకాలు: ఎర్రబెల్లి

తెరాస ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఇవ్వనటువంటి అనేక పనులు చేసిందని.. ఇచ్చిన హామీల్లో మిగిలిన వాటిని రానున్న మూడేళ్ల కాలంలో పూర్తి చేస్తామని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్​రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. మార్చిలో పెట్టనున్న బడ్జెట్​లో 2 పెద్ద పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ఉద్యోగాల భర్తీలో లెక్కలు తప్పని నిరూపిస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటానని పల్లా రాజేశ్వర్‌రెడ్డి సవాల్ విసిరారు.

మార్చిలో పెట్టనున్న బడ్జెట్​లో 2 పెద్ద పథకాలు: ఎర్రబెల్లి
మార్చిలో పెట్టనున్న బడ్జెట్​లో 2 పెద్ద పథకాలు: ఎర్రబెల్లి
author img

By

Published : Feb 25, 2021, 8:02 PM IST

మహబూబాబాద్ జిల్లా మరిపెడ, కురవిలో తెరాస ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహ సమావేశాలు జరిగాయి. ఇందులో తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, సత్యవతి రాఠోడ్​లు, మహబూబాబాద్ ఎంపీ కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్ పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్​దేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. రుణమాఫీ, నిరుద్యోగ భృతి, సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలను రానున్న మూడేళ్లలో అమలు చేస్తామన్నారు. మార్చిలో పెట్టనున్న బడ్జెట్​లో 2 పెద్ద పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు ఎర్రబెల్లి స్పష్టం చేశారు. రైతులకు భాజపా, కాంగ్రెస్‌లు ఏమీ చేయలేదని ఎద్దేవా చేశారు. పెట్రో ధరలు పెంచి ప్రజలపై భారాన్ని మోపుతున్నారని ఎర్రబెల్లి విమర్శించారు. నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.

త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డోర్నకల్ నియోజకవర్గంలో తెరాస బలాన్ని చూపించాలని మంత్రి సత్యవతి రాఠోడ్​ అన్నారు. ఎన్నికల కోసమే కాంగ్రెస్ వాళ్లు వస్తున్నారని ఎద్దేవా చేశారు. తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధితో ఎండాకాలంలో కూడా చెరువులు, కుంటలు అలుగులు పోస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం బయ్యారం ఉక్కు పరిశ్రమను, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటును విస్మరించిందన్నారు. ఈ ఎన్నికల్లో భాజపాకు బుద్ధి చెప్పాలన్నారు. ఉద్యోగాల భర్తీలో లెక్కలు తప్పని నిరూపిస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటానని పల్లా రాజేశ్వర్‌రెడ్డి సవాల్ విసిరారు.

మార్చిలో పెట్టనున్న బడ్జెట్​లో 2 పెద్ద పథకాలు: ఎర్రబెల్లి

ఇదీ చదవండి: రాష్ట్రానికి మరోసారి స్కోచ్‌ అవార్డులు.. ఉత్తమ మంత్రిగా కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.