మహబూబాద్ జిల్లా ఆమనగల్ శివారు కస్నా తండాకు చెందిన నూనవత్ రమేశ్,శ్రీను అన్నదమ్ములు. ఓ వ్యక్తి దగ్గర వేర్వేరుగా భూమి కొనుగోలు చేశారు. శ్రీను తన పొలంలో నాటు వేశాడు. రమేశ్ తన భూమిలోకి వెళ్లాలంటే అక్కడి నుంచే వెళ్లాలి. నాటు వేసిన పొలంలోంచి వెళ్లొద్దని రమేశ్‌ను శ్రీను అడ్డుకున్నాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. కోపోద్రిక్తుడైన రమేశ్ తన ట్రాక్టర్‌తో తన తమ్ముడిని ఢీకొట్టాడు. స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుని కుటుంబ సభ్యులును స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ పరామర్శించారు.
ట్రాక్టర్‌తో తమ్ముడిని ఢీకొట్టాడు..
పొలాల మధ్య గొడవతో సొంత తమ్మున్నే ట్రాక్టర్‌తో ఢీ కొట్టి చంపాడు ఓ అన్న. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కస్నాతండాలో చోటుచేసుకుంది.