మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి అంగన్వాడీ కేంద్రంలో పాములు కలకలం సృష్టించాయి. గదిని శుభ్రం చేస్తుండగా బండల మధ్యలో మెుదటగా ఒక పాము ఆయాకు కనపడింది. స్థానికుల సాయంతో ఆ పామును చంపగా... అందులోనుంచి వరుసగా 30 పాము పిల్లలు, 2 తేళ్లు బయటకు వచ్చాయి. వాటన్నింటినీ చంపి బయట పడేశారు.
సమయానికి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలోని ఓ గదిలో అంగన్వాడీ కేంద్రం నడుస్తోంది. భవనం శిథిలావస్థకు చేరుకోవడంతోనే పాములు, తేళ్లు వస్తున్నాయని... వెంటనే అక్కడి నుంచి అంగన్వాడీ కేంద్రాన్ని తరలించాలని గ్రామస్థులు కోరుతున్నారు. కొవిడ్ నిబంధనల ప్రకారం ఆహారాన్ని ఇంటివద్దకే అందిస్తుండటంతో అంగన్వాడీ కేంద్రానికి ఎవరూ రావడం లేదు.
ఇదీ చదవండి: జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో అపశ్రుతి