మహబూబాబాద్ జిల్లా రాజోలు పరిధిలోని హరిదాస్‌తండాలో పాముకాటుతో ఓ బాలుడు మృతిచెందాడు. తండాకు చెందిన ప్రసాద్, లలిత దంపతుల కుమారుడు అఖిల్.... ఓ ప్రైవేటు పాఠశాలలో నర్సరీ చదువుతున్నాడు. కరోనా కారణంగా సెలవులు ఇవ్వడం వల్ల తండాలో స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. ఇంతలో అఖిల్‌ను ఏదో కరవడం వల్ల కాలు నొప్పి వస్తుందని ఏడవగా... తోటి పిల్లలు తొండగా భావించారు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు.
ఇంటి వద్ద తల్లిదండ్రులు పనికి వెళ్లిపోవడం వల్ల గ్రామస్థులు విషయం తెలుసుకుని బాలుడిని మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా... బాబు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు. గ్రామస్థులు రాళ్లలో వెతికి పామును చంపేశారు. చిన్నారి మృతితో తండాలో విషాదం అలుముకుంది.
ఇదీ చూడండి: త్వరలో ప్రైవేటు ల్యాబ్‌ల్లోనూ కరోనా పరీక్షలు