ETV Bharat / state

'సునీల్​ నాయక్​ కుటుంబాన్ని ఆదుకోవాలి'

ఉద్యోగ నోటిఫికేషన్​ రావడం లేదని కలత చెంది ఆత్మహత్య చేసుకున్న సునీల్​ నాయక్​ కుటుంబాన్ని ఆదుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. అందులో భాగంగా మహబూబాబాద్ పట్టణంలో మంత్రి సత్యవతి రాథోడ్ ఇంటి ముట్టడికి యత్నించారు.

student unions protest at mahabubabad
విద్యార్థి సంఘాల ఆందోళన
author img

By

Published : Apr 3, 2021, 7:50 PM IST

కాకతీయ యూనివర్సిటీలో నోటిఫికేషన్​ రావడం లేదని ఆత్మహత్య చేసుకున్న సునీల్ నాయక్ కుటుంబాన్ని ఆదుకోవాలని పలు విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. నిరసనలో భాగంగా మహబూబాబాద్ జిల్లాలోని ఆధ్వర్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ ఇంటి ముట్టడికి ఎస్.ఎఫ్.ఐ, ఎల్.హెచ్.పి.ఎస్ , కె.వి.పి.ఎస్​లు యత్నించాయి. పోలీసులు అడ్డుకోవడంతో గేట్ ముందు బైఠాయించి ఆందోళన చేశారు.

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తేజావత్ సింగ్ తండాకు చెందిన బోడ సునీల్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్ట్​లను భర్తీ చేయాలంటూ నినాదాలు చేశారు. ఆందోళన విరమించక పోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ఇదీ చదవండి: మహిళా నేతపై ఎమ్మెల్యే కొడుకు లైంగిక దాడి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.