Prabhas Awareness Video on Drug Addiction : కొత్త సంవత్సరం వేళ డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. మనల్ని ప్రేమించే మనుషులు, మనకోసం బతికే మనవాళ్లు ఉన్నాక డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ అంటూ ప్రభాస్ ప్రశ్నించారు. జీవితంలో బోలెడన్నీ ఎంజాయ్మెంట్స్ ఉన్నాయని, కావల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉండగా డ్రగ్స్‌కు నో చెప్పాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు స్పందించిన సినీనటుడు ప్రభాస్ తన వంతు సామాజిక బాధ్యతగా యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారకుండా ఉండేందుకు అవగాహన కోసం ప్రత్యేక వీడియో విడుదల చేశారు. తెలిసిన వాళ్లు ఎవరైనా డ్రగ్స్‌కు బానిసలైతే వెంటనే 8712671111 నెంబర్‌కు ఫోన్ చేయాలని ప్రభాస్ సూచించారు. డ్రగ్స్‌కు బానిసలైన వాళ్లు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు.
'లైఫ్‌లో మనకు బోలెడన్నీ ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి. కావల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మనకోసం బతికే మనవాళ్లు మనకు ఉన్నారు. జీవితాన్ని నాశనం చేసే డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్. సే నో టూ డ్రగ్స్. మీకు తెలిసిన వాళ్లు ఎవరైనా డ్రగ్స్‌కు బానిసలైతే 8712671111 నెంబర్‌కు ఫోన్ చేయండి. డ్రగ్స్‌కు బానిసలైనవాళ్లు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది'- ప్రభాస్, సినీ నటుడు
Thank you @alluarjun , @SukumarWritings & #Pushpa2ThaRule Movie Team,for your support in fight against drugs.@TelanganaCMO @revanth_anumula @TelanganaDGP @director_tganb @narcoticsbureau @NMBA_MSJE @TelanganaCOPs @hydcitypolice @cyberabadpolice @RachakondaCop #drugfreetelangana pic.twitter.com/290LmG7A9U
— Telangana Anti Narcotics Bureau (@TG_ANB) November 29, 2024
Actor Allu Arjun on Drug Addiction : మరోవైపు హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక కూడా డ్రగ్స్‌పై అవగాహన కల్పించారు. ఈ మేరకు యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారకుండా ఉండేందుకు అవగాహన కల్పిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. తమ వంతు సామాజిక బాధ్యతగా డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తూ యువతకు సందేశాన్ని ఇచ్చారు. మీకు తెలిసిన వాళ్లు ఎవరైనా డ్రగ్స్‌కు బానిసలైతే 1908కు కాల్ చేయాలని అల్లు అర్జున్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం వాళ్లను శిక్షించడం కాదని, వారికి సాయం చేయడమని వ్యాఖ్యానించారు. ఎవరైన డ్రగ్స్ అమ్మడం లేదా కొనుగోలు చేస్తే 1908కు కాల్ చేయాలని హీరోయిన్ రష్మిక విజ్ఞప్తి చేశారు. 'సే నో టూ డ్రగ్స్' అంటూ పేర్కొన్నారు.
నాతో చేతులు కలపండి - ప్రభుత్వ సంకల్పంలో భాగం అవ్వండి : ఎన్టీఆర్ - NTR on Drugs Awareness