మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో భాజపా కార్యకర్తలు తహసీల్దార్ విజయలక్ష్మికి ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ అన్ని వర్గాల ప్రజలకు గుదిబండగా మారిందని.. వెంటనే రద్దు చేయాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారాన్ని మోపేందుకే ఎల్ఆర్ఎస్ను తీసుకొచ్చిందని.. తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వెంకన్నతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.