మైనారిటీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మరిపెడ, చిన్నగూడూరు మండలాలకు చెందిన క్రైస్తవులకు కానుకలు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్‌చేసి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
పండగలను అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు బట్టల పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోన్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: సినీ నటి లావణ్య త్రిపాఠి ఇంటిపై డీజీజీఐ దాడులు