తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్, పార్టీ కార్యకర్తలకు సూచించారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో నిర్వహించిన నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యాక లక్షా 35వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశామని ఎమ్మెల్యే అన్నారు. మరో 50వేలకు పైగా ఉద్యోగాల నియామకానికి మార్చి నెలలోపు ప్రకటన వెలువడుతుందని తెలిపారు. తెరాసకు అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం కాంగ్రెస్ కసరత్తు