కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించడం వల్ల వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు ఆయా ప్రాంతాల్లో భోజన వసతి కల్పిస్తున్నామని మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచర్ల, తెల్లబండ తండాతో పాటు గిరిజన తండాల్లో ఆమె పర్యటించారు.
మిర్చి ఏరేందుకు, ఇటుక బట్టీల్లో పని చేసేందుకు ఒరిస్సా, మహారాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలను కలిసి వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వారికి అన్ని వసతులు కల్పించాలని.. కూలీల పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పాలు, గుడ్లు, ఆహార పదార్థాలు అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: విస్తరిస్తున్న కరోనా... ఒక్కరోజే 14 మందికి