ETV Bharat / state

చేతులు జోడించి వేడుకున్న మంత్రి సత్యవతి

కరోనా నేపథ్యంలో ఏప్రిల్ 15 వరకు జరిగే లాక్​డౌన్​ను రాష్ట్ర ప్రజలంతా సంపూర్ణంగా ఆచరించి, సహకరించాలని మంత్రి సత్యవతి రాఠోడ్ చేతులు జోడించి వేడుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ కళాశాలలో వీధి బాలలు, వలస కూలీలకు మంత్రి దుస్తులు, దుప్పట్లను అందజేశారు.

minister-satyavati-pleads-with-hands-in-mahabubabad
చేతులు జోడించి వేడుకున్న మంత్రి సత్యవతి
author img

By

Published : Apr 4, 2020, 5:52 PM IST

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ కళాశాలలో వీధి బాలలు, వలస కూలీలకు మంత్రి సత్యవతి రాఠోడ్ దుస్తులు, దుప్పట్లను పంపిణీ చేశారు. ఊపిరి పీల్చుకునే సమయంలోనే పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయని మంత్రి అన్నారు. రాష్ట్రంలో వలస కూలీలు పస్తులు ఉండకుండా చూడటమే సీఎం కేసీఆర్ ఆలోచన అన్నారు.

జిల్లాలో 450 నుంచి 500 మంది అనాథలు, పేదవారికి ఆశ్రయం కల్పించి, మూడు పూటలు దాతల సహకారంతో భోజనం అందిస్తున్నామన్నారు. రేపు రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు జరిగే దీపాల ప్రదర్శనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. స్వీయ నియంత్రణే.. శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. సామాజిక దూరాన్ని పాటించండి.. కరోనాను తరిమి కొట్టండి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ఇంద్రసేనారెడ్డి, డీఎస్పీ నరేష్ కుమార్, వస్త్ర వ్యాపారులు పాల్గొన్నారు.

చేతులు జోడించి వేడుకున్న మంత్రి సత్యవతి

ఇదీ చూడండి : 'దాతలు ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.